- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthy Suresh: కుర్రాళ్లూ గుండెను రాయి చేసుకోండి.. ‘మహానటి’ పెళ్లి కబురు వచ్చేసింది..(ట్వీట్)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తండ్రి కూడా ఇటీవల పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, కీర్తి సురేష్ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఓ కీలక ప్రకటన(Key announcement) విడుదల చేసి కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసింది. ఆంటోని(Antony)తో రిలేషన్‌షిప్(Relationship)లో ఉన్నట్లు తెలుపుతూ అతడితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట పెట్టింది. అంతేకాకుండా ‘‘15 ఏళ్ల స్నేహ బంధం జీవితాంతం కొనసాగనుంది. ఎప్పటికీ ఆంటోని-కీర్తి ఒక్కటే’’ అని రాసుకొచ్చింది. అలాగే వీరిద్దరి పేర్లను కూడా క్యాప్షన్‌గా పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు.
ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఆంటోని, కీర్తి చిన్నప్పటి నుంచి ఒకే చోట చదువుకున్నారని సమాచారం. ఇంటర్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవల వీళ్ల ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘రఘుతాత’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ రివాల్వర్ రీటా, బేబీ జాన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో ఇక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.