బాలికలకు రక్షణ కరువు.. ప్రహరీ కూలి నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు..

by Sumithra |
బాలికలకు రక్షణ కరువు.. ప్రహరీ కూలి నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు..
X

దిశ, భద్రాచలం : సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో బాలికలకు రక్షణ కొరవడింది. రక్షణగా ఉండాల్సిన ప్రహరీ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిర్మించకుండా అడ్డుగా గుడ్డలు కట్టడంతో వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలికలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, దళిత బాలికల పట్ల చిన్నచూపు ఈ ఘటనలో స్పష్టంగా కనబడుతుంది.

పట్టణంలో ప్రధాన రహదారి పక్కన కూనవరం రోడ్డులో గల బాలికల వసతి గృహం ప్రహరీకి గ్రీన్ మ్యాట్ క్లాత్ కట్టి మమ అనిపించారు. దళిత బాలికలు, కళాశాల విద్యార్థినులు కలిసి ఉండే హాస్టల్ కు గోడ లేకపోవడంతో భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టి, వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలికలకు రక్షణ కల్పించాలని దళిత, మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed