- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home Minister:పరవాడ ఫార్మాసిటీ ప్రమాదం పై హోంమంత్రి అనిత సీరియస్
దిశ,వెబ్‌డెస్క్: విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో(Parawada Pharmacy) నేడు(బుధవారం) ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పని చేసే 15 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఈ ఘటనపై ఆమె సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్య వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.