- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyber Frauds: తొమ్మిది నెలల్లో రూ. 11,333 కోట్ల సైబర్ మోసాలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ వినియోగంతో పాటే సైబర్ మోసాలు కూడా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకు రూ. 11,333 కోట్ల విలువైన సైబర్ మోసాలు జరిగాయి. అందులో అత్యధికంగా స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లే కావడం గమనార్హం. ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 2,28,094 ఫిర్యాదులు రాగా, వాటి విలువ రూ. 4,636 కోట్లు. ఆ తర్వాత పెట్టుబడుల స్కామ్‌ల గురించి రూ. 3,216 కోట్ల(1,00,360 ఫిర్యాదులు) మోసాలు జరిగాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలపై 63,481 ఫిర్యాదులు రాగా, రూ. 1,616 కోట్ల మోసం జరిగినట్టు ఐ4సీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా కూడా సైబర్ మోసాలు గణనీయంగా నమోదవుతున్నాయి. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా చెబుతున్న ప్రకారం ఈ ఏడాది దాదాపు 12 లక్షల సిబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా 45 శాతం ఆగ్నేయాసియా దేశాలైనా మయన్మార్, కంబోడియా, లావోస్‌లలో ఉన్నాయి.
'డిజిటల్ అరెస్ట్'పై ప్రధాని మోదీ వార్నింగ్..
సైబర్ మోసాలకు సంబంధించి 115వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఇదివరకే హెచ్చరించారు. ప్రధానంగా 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు వ్యతిరేకంగా తీవ్ర హెచ్చరిక చేశారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ వ్యక్తులను ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా కేసు నమోదైందని, కొంత మొత్తం చెల్లించాలని బెదిరించడం. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 'చట్టం ప్రకారం డిజిటల్ అరెస్టు లాంటి వ్యవస్థ ఏదీ లేదని' ప్రధాని మోడీ స్పష్టం చేశారు.