Breaking: జగన్‌కు వైఎస్ షర్మిల బిగ్ షాక్.. లంచం వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-11-27 15:20:11.0  )
Breaking: జగన్‌కు వైఎస్ షర్మిల బిగ్ షాక్.. లంచం వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YCP chief Jagan Mohan Reddy)కి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) బిగ్ షాక్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వ్యాపార వేత్త అదానీ(Businessman Adani) లంచం ఇచ్చారని అమెరికా న్యూయార్క్‌(America New York)లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా ముడుపులు అందాయని కేసులో ప్రస్తావన వచ్చింది. దీంతోవిద్యుత్ ఒప్పందాల వ్యవహారంపై రాష్ట్రంలో కూడా విచారణ చేపట్టాలని వైఎస్ షర్మిల సంచలన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌(State Governor Abdul Nazir)ను కలిశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ హాయాంలో రాష్ట్రాన్ని అదానీకిచ్చే ప్రయత్నం జరిగిందన్నారు. సోలార్ పవర్ డీల్‌లోనే రూ. 1,750 కోట్లు జగన్‌కు లంచం వచ్చిందని ఇప్పుడు బయటపడిందని చెప్పారు. రూ. 9 వేల కోట్లు విలువైన గంగవరం పోర్టును ఆదానికి జగన్ రూ. 640 కోట్లకే అమ్మేశారని ఆరోపించారు. ఇలా చేయడం అన్యాయం కాదా..? అని ఆమె ప్రశ్నించారు. మరో పదిహేనేళ్లలో గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేదని, అలాంటి వీలే లేకుండా జగన్ చేసేశారని మండిపడ్డారు. ఇలా మిగిలిన వాటిల్లో కూడా జగన్‌కు ఇంకెంత లంచం వచ్చి ఉండాలని వ్యాఖ్యానించారు. మరి ఇవేవీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా..? అని నిలదీశారు. అవినీతి ఎంత, ఎక్కడ జరిగిందనే విషయాలు తెలుసుకోకుండానే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను ఎలా రద్దు చేస్తారు? అని ప్రశ్నించారు. ఆ డీల్ ను రద్దు చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లు కారా...? అని షర్మిల నిలదీశారు.

‘‘విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వ్యవహారంలో అక్రమం జరిగిందని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని అమెరికా వాళ్లు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి ఇక్కడ కనీసం ఎక్వైరీ అయినా చేయాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయంలో పార్లమెంట్‌‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఎంపీలు మద్దతు తెలపాలి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


Read More..

Vijayawada: జగన్‌కు బిగ్ షాక్.. సంచలన డిమాండ్ చేస్తూ పాదయాత్ర

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story