‘ఆ వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలి’.. మాజీ మంత్రి డిమాండ్

by Jakkula Mamatha |
‘ఆ వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలి’.. మాజీ మంత్రి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తండ్రి లాంటి కేసీఆర్ మరణం కోరుకుంటారా? అని నిలదీశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అసెంబ్లీ ఏ విధంగా జరుగుతున్నదో ప్రజలు చూసేవారని.. ఇప్పుడు అసెంబ్లీని కాంగ్రెస్ కౌరవ సభలాగా మార్చిందన్నారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదని.. చట్టసభలు, స్పీకర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందన్నారు.

దళితులు అంటే గౌరవం వల్లే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. సెక్రెటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఇప్పటివరకు సీఎం దండ వేయలేదని ఆరోపించారు. స్పీకర్‌ను అవమానించారని సభా సమయాన్ని వృధా చేశారని.. ఆయన పై ఒత్తిళ్లు ఉన్నాయని అన్నారు. స్పీకర్‌ను వ్యక్తిగతంగా జగదీశ్‌రెడ్డి అన్నట్లు వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో లేకుండా అసెంబ్లీని నడపాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story