Formula E Race: మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-రేస్‌ కేసు.. వారికి మరోసారి నోటీసులు ఇచ్చే చాన్స్

by Shiva |   ( Updated:2025-03-15 15:23:51.0  )
Formula E Race: మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-రేస్‌ కేసు.. వారికి మరోసారి నోటీసులు ఇచ్చే చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana)లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ రేసు కేసు (Formula E-Race Case)లో మళ్లీ కదలిక వచ్చింది. కేసులో ఇప్పటికే కీలక అధారాలు సేకరించిన ఏసీబీ (ACB) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారం కేసులో నిందితులకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ పిలువనున్నట్లుగా తెలుస్తోంది. రేస్‌ నిర్వహణకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (Formula-E Operations) (FEO) సీఈవోతో పాటు ఆ సంస్థ ప్రతినిధులను వర్చువల్‌ (Virtual)గా విచారించిన ఏసీబీ (ACB) అధికారులు వారు ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి చర్యలకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఇదే కేసులో ఫెమా (FEMA) నిబంధనలకు ఉల్లంఘించి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నేరుగా బదిలీ చేశారంటూ ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టింది. రెండు దర్యాప్తు సంస్థలు డిసెంబరు, జనవరి నెలల్లో కేసులో నిందితులను విచారించి వారి స్టేట్‌మెంట్లను సైతం రికార్డ్ చేశాయి. అప్పటి నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ (ACB) మరోసారి కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చి వారిని మరోసారి విచారించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

READ MORE ...

KTR: ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: ప్రభుత్వంపై కేటీఆర్ హాట్ కామెంట్స్




Next Story