భార్యను వదిలేసి ట్రాన్స్‏జెండర్‏తో ఆ పని.. ఓటీటీలో హీట్ పుట్టిస్తున్న బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |   ( Updated:2025-03-15 03:37:25.0  )
భార్యను వదిలేసి ట్రాన్స్‏జెండర్‏తో ఆ పని.. ఓటీటీలో హీట్ పుట్టిస్తున్న బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ(ott) హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్, మర్డరీ, మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనినే అదునుగా చేసుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఆ జోనర్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అలా వేరే భాషల్లో సూపర్ హిట్ విజయం సాధించిన సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీలో హీట్ పుట్టిస్తున్న రొమాంటిక్ బోల్డ్ మూవీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా ‘జాయ్ ల్యాండ్’(Joy Land). రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం పాకిస్తానీ సినిమా. డైరెక్టర్ సైమ్ సాదిక్(Saim Sadik) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అపూర్వ గురు చరణ్(Apoorva Guru Charan), సమద్ సుల్తాన్ ఖూసత్, సబిహ సుమర్, లారెన్ మన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అలీనా ఖాన్, అలీ జునెజో, రస్తి ఫరూఖ్ , సర్వత్ గిలానీ, సోహైల్ సమీర్, సల్మాన్ పీర్, సానియా సయ్యద్ కీలక పాత్రలు పోషించారు.

అయితే ఎల్జీబీటీక్యూ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమాను మొదటగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. విడుదలకు ముందే అవార్డ్స్ అందుకున్న ఈ సినిమాకు ఐఎమ్‏డీబీ నుంచి 7.6 రేటింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఉర్దూ భాషలో ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. ఊహించని ట్విస్టులు, రొమాంటిక్ సీన్లతో ఓటీటీలో రచ్చ చేస్తుంది ఈ బోల్డ్ మూవీ. మరి ఇంకెందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసేయండి.


Read More..

బ్రేకప్ రూమర్స్.. తమన్నా, అతని బాయ్ ఫ్రెండ్ హోలీ వీడియో వైరల్

Next Story

Most Viewed