దాహం వేస్తుందంటే జాలి చూపింది.. కానీ తర్వాత ఏమైందంటే..

by Sridhar Babu |
దాహం వేస్తుందంటే జాలి చూపింది.. కానీ తర్వాత ఏమైందంటే..
X

దిశ, కూకట్​పల్లి : ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను మంచి నీళ్లు అడిగి ఆమె మెడలో నుంచి బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని పరారైన దొంగను కేపీహెచ్​బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్​ కుమార్​, ఏసీపీ శ్రీనివాస్​ రావు, సీఐ రాజశేఖర్​ రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు. కేపీహెచ్​బీ కాలనీ ఈడబ్ల్యూఎస్​ 998లో నివాసం ఉంటున్న మహిళ 12వ తేదీ​ తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ వ్యక్తి దాహం వేస్తుంది తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు. సదరు మహిళ ఇంట్లోకి వెళ్లి నీళ్ల బాటిల్​ తీసుకు వస్తుండగా ఆమె మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. దీంతో బాధితురాలు కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కేపీహెచ్​బీ పోలీసులు సీసీ కెమెరాలలో నమోదైన పుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులో తీసుకున్నారు.

నిందితుడు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉప్పు సాయి తేజ(26)గా గుర్తించారు. రాపిడో డ్రైవర్​గా పని చేస్తున్న సాయి తేజ విలాసాలకు అలవాటు పడి చోరీలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కేపీహెచ్​బీ కాలనీ టెంపుల్​ బస్టాప్​ వద్ద రోడ్డుపై సంచరిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను గమనించి ఆమెను దాహం వేస్తుంది నీళ్లు ఇవ్వమని అడిగాడు. మానవతా దృక్పథంతో నీళ్లు ఇచ్చేందుకు ఇంటిలోకి వెళ్లిన మహిళ వెంట ఇంటి లోపలికి ప్రవేశించి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాగాడు. దీంతో మహిళ ప్రతిఘటించడంతో గొలుసు తెగి ఓ ముక్క సాయితేజ చేతిలోకి వచ్చింది. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సాయి తేజ నుంచి మొబైల్​ ఫోన్​, బైక్​, బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించినందుకు డీసీపీ సురేష్​ కుమార్​, ఏసీపీ శ్రీనివాస్​ రావులు సీఐ రాజశేఖర్​ రెడ్డి, డీఐ కె. రవి కుమార్​, డీఎస్సై అబ్దుల్​ సమద్​, క్రైం సిబ్బంది ఎలాయాపాల్​, ఆనంద్​ రెడ్డి, రఘురాంలను అభినందించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed