- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోడీ, ట్రంప్‌లది గొప్ప లక్ష్యం

- ఉక్రెయిన్ విషయంలో చొరవ తీసుకున్నారు
- కాల్పుల విరమణమై సరైన నిర్ణయం తీసుకుంటాం
- రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: రెండేళ్లకు పైగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపడానికి మోడీ, ట్రంప్‌లు కలిసి తీసుకుంటున్న చొరవ పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. 30 రోజుల పాటు ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ లది గొప్ప లక్ష్యమని అన్నారు. వారిద్దరూ ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి తీసుకుంటున్న చొరవపై ఆయన ప్రశంసలు కురిపించారు. బెలారస్ ప్రెసిడెంట్ అలెక్జాండర్ లుకషెంకోతో కలిసి మీడియాతో మాట్లాడిన పుతిన్.. ప్రపంచ నాయకులందరూ కలిసి లక్ష్యాన్ని సాధించడానికి చేస్తున్న కృషి పట్ల తాను కృతజ్ఞత కలిగి ఉంటానన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయంలో చాలా దృష్టి పెట్టారు. అలాగే చైనా, బ్రెజిల్ ప్రెసిడెంట్లు.. ఇండియా ప్రధాని మోడీ కూడా కలిసి శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం వల్ల ప్రాణ నష్టం తగ్గడమే కాకుండా ఇరు దేశాల మధ్య శత్రుత్వాలు కూడా తగ్గిపోతాయని పుతిన్ అన్నారు.
గత నెల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఉక్రెయిన్‌పై తన స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. ఈ అంశంలో ఇండియా తటస్థంగా లేదని.. శాంతి వైపే తాము ఉన్నామని మోడీ వ్యాఖ్యానించారు. ఇది యుద్దం చేసే కాలం కాదు.. యుద్ద భూమిలో ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో యుద్దం మొదలైన దగ్గర నుంచి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ పలు మార్లు మాట్లాడారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దొరుకుతుందని మోడీ చెప్పారు. ఇండియా-రష్యాల మధ్య జరిగిన 22వ ద్వైపాక్షిక సమావేశాల్లో పుతిన్‌ను కలిసిన మోడీ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అదే సమయంలో మోడీ ఉక్రెయిన్‌కు కూడా వెళ్లారు.
కాగా, పుతిన్ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రష్యా కూడా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే పుతిన్ ఈ ప్రతిపాదనపై సుముఖంగా లేరని గతంలో జెలెన్‌స్కీ చెప్పారు. ఇప్పుడు పుతిన్ వ్యాఖ్యలతో జెలెన్‌స్కీ ఇరకాటంలో పడినట్లు అయ్యింది.
READ MORE ....
Donald Trump: జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టుకెక్కిన ట్రంప్