Chiyan Vikram: ‘వీర ధీర శూర-2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. పవర్ ఫుల్ గన్ చేతపట్టిన హీరో

by sudharani |   ( Updated:2025-03-14 14:58:35.0  )
Chiyan Vikram: ‘వీర ధీర శూర-2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. పవర్ ఫుల్ గన్ చేతపట్టిన హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్(Chiyan Vikram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర-2’(Veera Dheera Sooran-2). అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య(SJ Surya), సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ (Siddique)కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్‌ఆర్ పిక్చర్స్(HR Pictures) బ్యానర్‌పై రియాశిబు నిర్మిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో ‘వీర దీర శూర-2’ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని విక్రమ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్స్‌(Promotions)లో భాగంగా తాజాగా టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘గ్రామీణ యాక్షన్ స్పెక్టాకిల్ ‘వీర ధీర శూర-2’ టీజర్ (Teaser) రేపు సాయంత్రం (మార్చి 15) 6:00 గంటలకు విడుదల కానుంది’ అని తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ ఓ పవర్ ఫుల్ గన్‌ను చేతపట్టి సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు.

Read Also..

Beauty: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed