కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

by Mahesh |
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీతో రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలు, అంశాలపై పొన్నం ప్రభాకర్ చర్చించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్ కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టలకు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేయబడే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి చేసిన విజ్ఞప్తులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాం అక్కడ ఈ కింది వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే ఢిల్లీలోని IDTR తరహాలో 15వ ఫైనాన్స్ కమిషన్ కింద హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో డ్రైవర్లకు చాలా శిక్షణ అవసరం ఉందని.. దీని కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (IDTR) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బహుళ-లేన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌ను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని, రోడ్ సేఫ్టీ కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమలు కోసం, ఈ-చలాన్‌ల ఆటో జనరేషన్ ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను గుర్తించాలని తెలిపారు.

అలాగే MVIలు, AMVIలకు నాణ్యమైన సాంకేతికంగా ఫీల్డ్ శిక్షణ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని EV ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు భారీ డిమాండ్ ఏర్పడిందని.. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. అంతే కాకుండా తన నియోజకవర్గం హుస్నాబాద్‌లో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు‌గా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ‌ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ భేటీలో మంత్రితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story