- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాగూర్ లేబొరేటరీస్ విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పనిచేసే ఒకరు మృతి చెందగా, 15 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి కారణాలపై ఆరా తీస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.