Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. రాణించిన అదానీ గ్రూప్ షేర్లు..!

by Maddikunta Saikiran |
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. రాణించిన అదానీ గ్రూప్ షేర్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ రావడంతో ఫ్లాట్ గా మొదలైన మార్కెట్లు ఆఖర్లో పుంజుకొని లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు అదానీ స్టాక్స్ రాణించాయి. తమ గ్రూప్ కంపెనీలపై వచ్చిన లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో ఆ సంస్థ స్టాక్స్ లాభాల్లో రాణించాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం చొప్పున లాభపడగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 10 శాతం వరకు రాణించాయి.

సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80, 121.47 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై కాసేపటికే ఒడిదొడుకులు ఎదుర్కొంది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగింది. చివరికి 230 పాయింట్ల లాభంతో 80,234.06 వద్ద స్థిరపడింది. మరోవైప్పు నిఫ్టీ(Nifty) 80 పాయింట్లు పెరిగి 24,274.90 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.33 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.44కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ

నష్టాల్లో ముగిసిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్

Advertisement

Next Story

Most Viewed