- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
High Court: ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై (Food Poisoning Incidents), హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో శాంపిల్స్ సేకరించాలని ఆదేశించింది. నమూనాలను ల్యాబ్‌కు పంపించి సోమవారం వరకు పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మాగనూరు ఘటనపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విరామం తర్వాత మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన పిల్లలు బయటి చిరుతిళ్లు తిన్నారని ఏఏజీ వాదనలు వినిపించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకున్నాని చెప్పారు. అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.