ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గంజాయి సరఫరా చేసే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు రద్దు

by Mahesh |
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గంజాయి సరఫరా చేసే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్(Anti Narcotic Task Force) పేరును ‘ఈగల్’గా మార్చడం పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోం మంత్రి అనిత(Home Minister Anitha) బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ (Marijuana, Drug Control) పై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై చర్చించి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

నార్కోటిక్స్ నియంత్రణ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh).. ఈ నిర్ణయం గురించి ప్రకటించారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు(Eagle committees with 10 people).. ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అలాగే ఈ కమిటీల్లో స్థానికంగా ఉండే మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో జరుగుతున్న అనేక దారుణాలకు గంజాయి మత్తు కారణమని తెలియడంతో.. రాష్ట్రంతో గంజాయి వాడకాన్ని అరికట్టేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed