- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ.. 3 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) ఈ రోజు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను సంస్థ గరిష్టంగా రూ. 108గా ఖరారు చేయగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE)లో 3.2 శాతం ప్రీమియంతో రూ. 111.50 వద్ద లిస్ట్ అయ్యింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)లో 3.3 శాతం ప్రీమియంతో రూ. 111.60 వద్ద ప్రారంభమైంది. కాగా ఈ సంస్థ సుమారు రూ. 10,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఐపీవోకు రాగా.. మొత్తంగా 2.55 రేట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. 56 కోట్ల షేర్లకు గాను 142 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) కోటా 3.51 రేట్ల సబ్ స్క్రైబ్ అవ్వగా రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 2.98 రేట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII) కోటా 80 శాతం బిడ్లు అందుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 3,960 కోట్లను సమీకరించింది. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని రుణాలను చెల్లించడానికి, మిగతా వాటిని కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.