IAS: భర్త పొలిటికల్ కింగ్ మేకర్.. భార్యకు నో లీవ్స్.. లేడీ ఐఏఎస్ ఆఫీసర్ కు సర్కార్ షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-12-01 15:28:08.0  )
IAS: భర్త పొలిటికల్ కింగ్ మేకర్.. భార్యకు నో లీవ్స్.. లేడీ ఐఏఎస్ ఆఫీసర్ కు సర్కార్ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది అంటుంటారు. ఓ లేడీ ఐఏఎస్ అధికారిణి (IAS Officer) విషయంలో ఇప్పుడు అచ్చం అలాగే జరుగుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆమె భర్త పొలిటికల్ గా కింగ్ మేకర్ అయినప్పటికీ ఆమె లీవ్స్ విషయంలో మాత్రం చుక్కెదురైంది. పిల్లల సంరక్షణ కోసం సెలవు లీవ్స్ పొడిగించాలన్న సదరు మహిళా ఆఫీసర్ విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో చేసేదేమి లేక నేటి నుంచి ఆమె విధులకు హాజరవుతున్నారు. ఒడిశా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ సుజాతా కార్తికేయన్ (Sujata Karthikeyan) సెలవుల వ్యవహారం అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోను చర్చకు దారి తీసింది. అసలేం జరిగిందంటే..

ఆమె భర్త షాడో సీఎం:

సుజాతా కార్తికేయన్ మాజీ ఐఏఎస్, బీజేడీ నేత వీకే పాండియన్ (V.K Pandian) భార్య. ఇతను ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) సన్నిహితుడే కాదు. ఆయన వారసుడిగా ప్రచారంలోకి వచ్చారు. 25 ఏళ్లుగా అప్రహతిహతంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్ స్థానంలో గత టర్మ్ లో వీకే పాండియనే షాడో సీఎంగా వ్యవహరించేవారనే టాక్ ఆ రాష్ట్ర రాజకీయ బలంగా ప్రచారం జరిగింది. అయితే భర్త రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడంతో సునితా కార్తికేయన్ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2000 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన కార్తికేయన్ ఆరేళ్లుగా ఆ రాష్ట్రంలోని మిషన్ శక్తి విభాగంలో పని చేశారు. అయితే గత జూన్5న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆమె 10 తరగతి పరీక్షలకు హాజరయ్యే తన మైనర్ కుమార్తెను చూసుకోవడానికి ఆరునెలల పాటు సెలవులపై వెళ్లారు. కానీ అనూహ్యంగా అక్కడ బీజేడీ ఓటమి పాలై బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆరు నెలల సెలవుల గడువు ముగియడంతో మరో ఆరు నెలల సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆమె విజ్ఞప్తికి అక్కడి బీజేపీ (BJP) ప్రభుత్వం నో చెప్పింది. దీంతో ఆమె ఇవాళ ఉదయం విధుల్లో చేరారు.

'బీజేడీ విశ్వసనీయ బ్యూరోక్రాట్' గా ముద్ర:

ఒడిశా ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష బీజేపీ (BJD) సుజాతా కార్తికేయన్ బీజేడీ విశ్వసనీయ బ్యూరోక్రాట్ అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ శక్తి కార్యక్రమానికి ఆమె పని చేశారని ఈ కార్యక్రమం కింద గత ప్రభుత్వం ఆరు లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలలో 70 లక్షల మంది గ్రామీణ మహిళలను ఏర్పాటు చేసినట్లు బీజేపీ ఆరోపించింది. 2024 ఎన్నికల్లో బీజేడీకి ఓటు వేయడానికి ఈ సంఘాలలోని మహిళలను ప్రోత్సహించేలా సునీతా కార్తికేయన్ ప్రభావితం చేశారని అందువల్ల ఆమెను సస్పెండ్ చేయాలని కమలం నేతలు ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను మిషన్ శక్తి నించి మరో శాఖకు ఈసీ బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేడీ అధికారం కోల్పోయిన మరుసటి రోజు (జూన్ 5)న సెలవులపై వెళ్లడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Advertisement

Next Story

Most Viewed