Rajasingh: మోడీతో భేటీకి ముందు స్టేట్ ప్రెసిడెంట్ పై రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |
Rajasingh: మోడీతో భేటీకి ముందు స్టేట్ ప్రెసిడెంట్ పై రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తో భేటీ కాబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దీంతో ప్రధానితో జరగబోయే ఈ భేటీలో ఏం చర్చించబోతున్నారు? కేంద్ర పెద్దలు రాష్ట్ర నేతలు ఏం సందేశం ఇవ్వబోతున్నారనే చర్చ సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు (BJP State New President) వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తానెప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించలేదన్నారు. నేను ఆడగబోనన్నారు. హిందూ ధర్మం పట్ల ప్రతి రాష్ట్రంలో ప్రచారం చేయాలనే సంకల్పంతో ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేవలం మాటలకే పరిమితం అయ్యారని, తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మోడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేసీఆర్ (KCR) అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని స్టేట్ మెంట్లు ఇవ్వడం సరికాదన్నారు.

Advertisement

Next Story