- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తాం
దిశ,సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యతగా విద్య, వైద్య రంగాలని గుర్తించామని, పేదలకు, విద్యార్థులకు నాణ్యమైన వైద్యం విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గురుకుల పాఠశాలలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనము, డార్మెటరీ, ఆడిటోరియం,కిచెన్ లను బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనంలో కోటి రూపాయల విలువైన నూతన ఫర్నిచర్ ను ఏర్పాటు చేసేందుకు దివిస్ పరిశ్రమ సహకారం అందించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలోనే మొట్టమొదటి గురుకులంగా సర్వేలు గురుకుల పాఠశాల స్థాపించబడిందని అన్నారు. పేద విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి లను చేసింది సర్వేలు గురుకులమేనని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అత్యాధునిక హంగులతో నిర్మితమైన పాఠశాల ప్రస్తుతం సర్వేలు గురుకులమేనని కొనియాడారు. మానవునికి చదివే ఆయుధమని, చదువు ముందు ఏ శక్తి నిలవదని గ్రహించాలని సూచించారు. డబ్బులు అందరూ సంపాదిస్తారని సంపాదించిన వారికి దానం చేసే దాతృత్వ గుణం ఉండాలని అన్నారు. దివిస్ సహకారంతో నెలరోజుల పాటు నాణ్యమైన ఫర్నిచర్ ను వెతికి పాఠశాలకు అందించామని గుర్తు చేశామునుగోడు నియోజకవర్గంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.రు.
నవంబర్ నెల 23వ తారీఖు సర్వేలు గురుకుల పాఠశాలను ప్రారంభించారని, అదే నవంబర్ మాసంలో నూతన భవనాలను ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. దేశ భవిష్యత్తుకు పునాది విద్యార్థులేనని, సమాజానికి సేవ చేసేందుకు చదివే ఆయుధమని అన్నారు. చదువు మనల్ని కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని కాపాడేలా ఉపయోగపడుతుందన్నారు. అందుకే ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. త్వరలోనే పాఠశాలలో మరో డార్మెటరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని, అది మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండేలా స్వయంగా తానే డిజైన్ ను రూపొందిస్తానని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొండోడని అనుకున్న పని పూర్తి చేసే వరకు విశ్రమించడని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భవనాలు 100 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం నాణ్యతగా చేయాలని, బడి అంటే గుడితో సమానమని అన్నారు. మానవ జీవితం పాఠశాల విద్యతోనే ప్రారంభమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో సర్వేలు గురుకులంలో సుమారు 2000 వరకు విద్యార్థులు విద్యను అభ్యసించేలా చర్యలు చేపడతామని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 500 పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో 50 నుంచి 60 మంది విద్యార్థులే ఉన్నారని, అలా కాకుండా కార్పొరేట్ స్థాయిలో మండలానికి 5 పాఠశాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
44 ఎకరాలను సర్వేలు గురుకుల పాఠశాలకు ఇచ్చిన మద్ది నారాయణరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థులు బలహీనంగా ఉండడాన్ని తాను గమనించానని ప్రిన్సిపాల్ ఇకపై నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకస్మికంగా తానే వచ్చి ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానన్నారు. ఆ సమయంలో నాణ్యత లోపిస్తే ప్రిన్సిపల్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల సంస్థ కార్యదర్శి రమణ కుమార్, డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, డిఇఓ సత్యనారాయణ, ఈఈ శైలజ, డిఈ ఎం.శివకుమార్, స్థానిక తాసిల్దార్ ఎం కృష్ణ, ఎంపీడీవో నరసింహారావు, స్థానిక నాయకులు వెనుముల శంకర్ రెడ్డి,గుత్తా శేఖర్ రెడ్డి, మానుపాటి సతీష్, చిలకరాజు రాజు,దివిస్ జనరల్ మేనేజర్ సుధాకర్, అదేవిధంగా తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.