Dilawarpur : దిలావర్పూర్ లో రెండవ రోజు తీవ్ర ఉద్రిక్తత

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-27 08:17:33.0  )
Dilawarpur : దిలావర్పూర్ లో రెండవ రోజు తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : దిలావర్పూర్ (Dilawarpur)లో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory)ని రద్దు చేయాలంటూ నిన్న చేపట్టిన మెరుపు ధర్నా ను నాలుగు గ్రామాల ప్రజలు రెండో రోజు కూడా కొనసాగించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఆర్డీవో ను నిర్బంధించగా, 600మంది పోలీసులు బందోబస్తుతో వెళ్లి గ్రామస్తుల అధీనం నుంచి బలవంతంగా ఆర్డీవోను విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు ధర్నా కొనసాగిస్తున్నారు. దీంతో దిలావర్ పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులను నిరసన కారులు ఎదురించడం..ఇథనాల్ ఫ్యాక్టరీనా.. మేమా? ఏదో ఒకటే ఉండాలన్నట్లుగా భీష్మించడంతో వారికి సర్థిచెప్పలేక పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ, పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసనకు దిగారు. ఆందోళనకారుల్లో కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు నిరసనల్లో ముందుండి పోరాడుతుండటంతో లా ఆండ్ ఆర్డర్ పోలీసులకు సవాల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed