Deputy CM Bhatti : రైతు భరోసా విధివిధానాలపై త్వరలో క్లారిటీ ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-27 11:22:48.0  )
Deputy CM Bhatti : రైతు భరోసా విధివిధానాలపై త్వరలో క్లారిటీ ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎన్నికల్లో హామీల్లో ఒకటైన రైతు భరోసా(Farmer Assurance)పై ప్రభుత్వం మంత్రి వర్గం ఉప సంఘంతో కసరత్తు చేస్తుందని, రైతు భరోసా విధివిధానాలు ఏంటనేది త్వరలో క్లారిటీ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ హామీ అమలు చేశామని, మిగిలిపోయిన వారందరికి రుణమాఫీ జరుగుతుందన్నారు. 15 రోజుల్లో 18 వేల కోట్లు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రుణమాఫీ చేస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమానికి పెద్ధపీట వేస్తామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇడ్ల పంపిణీ త్వరలో షురూ కాబోతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము అర్హులైన పేదలకు త్వరలో రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని భట్టి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్, కర్ణాటకలో గెలిచిందని, కేరళ, వెస్ట్ బెంగాల్ లో గెలిచామని, మధ్య ప్రదేశ్ లో గెలిచామని, ఒక మహారాష్ట్రలో ఓడిపోయిందే చూపిస్తున్నారన్నారు. గెలిచిన వాటి కోసం ఆలోచన చేయాలని, అన్ని చోట్లా ఒకే పార్టీ గెలవాలి అని లేదన్నారు. బీజేపీ మతం పేరుతో ప్రజలను విడగొడుతుంటే మేము కలపాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ కులగణన తీసుకవచ్చారని చెప్పారు. ఇపుడు ఎక్ హై తో సాత్ హై అని కొత్త మాట బీజేపీ తెస్తుందని, ప్రియంబుల్ అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని చెప్పిందన్నది మరువరాదన్నారు. కుల గణన సర్వేపై మా ప్రభుత్వం ముందుకెలుతుందన్నారు. ఏ కులం ఎంత అని తేలగానే డిబేట్ పెట్టుదామని, రిజర్వేషన్ల ప్రాతిపదికన స్థానిక ఎన్నికల నిర్వాహణపై నిర్ణయం తీసుకునేందుకు పీసీసీ, సీఎం సమావేశం అవుతారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేసుకుంటు వెలుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ను కూకటి వ్రేళ్లతో సహా పెకిలిస్తామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమని, అది ఎవ్వరి తరం కాదన్నారు. కేటీఆర్ మైండ్ సెట్ బూర్జువా, భూస్వామ్య లక్షణాలతో ఉండటంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని భ్రమల్లో బతుకుతున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభకు హాజరై ప్రజాస్వామిక భూమిక పోషించాలన్నారు. కాంగ్రెస్ లో అనేక ఏండ్లుగా ఉన్న వారు, కొత్తగా చేరిన వారు కలిసిపోవడానికి కొంత టైమ్ పడుతుందని, బీఆర్ఎస్ మిగతా ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story