- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Turning Point: క్రైమ్ థ్రిల్లర్‌గా ‘టర్నింగ్ పాయింట్’ టీజర్..

దిశ, సినిమా: అరుణ్ ఆదిత్ (Arun Adit) హీరోగా, హెబ్బాపటేల్ (Hebbapatel), ఇషాచావ్లా (Ishachawla), వర్షిణి (Varshini) హీరోయిన్స్‌గా నటిస్తున్న తాజా మూవీ ‘టర్నింగ్ పాయింట్’ (Turning Point). స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి కుహన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరో అల్లరి నరేష్ (Allari Naresh) విడుదల చేశారు. ఇక మిస్టరీ అండ్ సస్పెన్సింగ్‌గా సాగిన ఈ టీజర్ రిలీజ్ అనంతరం నరేష్ మాట్లాడుతూ ‘‘టర్నింగ్ పాయింట్’ టీజర్ అందర్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఈ సినిమా హీరో త్రిగుణ్ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో అతని కెరీర్‌కు కమర్షియల్ సక్సెస్‌తో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనుకుంటున్నాను. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, చిత్ర టీమ్ అందరికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ కుహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న మా చిత్రం టీజర్‌ను నరేష్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller)గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ (Powerful Police Officer)గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ ఏపిసోడ్స్ (Action Episodes) కూడా అలరించే విధంగా ఉంటాయి. మర్డర్ మిస్టరీ (Murder Mystery)కి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.