- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS Leader: ఆ ప్రాజెక్టు లేకపోతే ఒక్క పంటకు నీళ్లు రావు
దిశ, వెబ్‌డెస్క్: అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు(Putta Madhu) విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) జేబులో పైసలు నింపుకున్నారని ఆరోపించారు. మంథని నియోజకవర్గ ప్రజలను శ్రీధర్ బాబు తరచూ మోసం చేస్తున్నారని అన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.570 కోట్లు ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) చెప్పారు. ప్రాజెక్టుపై అధికారులు ఇప్పటి వరకు ఒక్క రివ్యూ చేయలేదు. అసలు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండు నెలల నుండి ఎస్ఈ లేరని పుట్టా మధు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు లేకపోతే ఒక్క పంటకు తప్ప నీళ్లు రావు అన్నారు.