- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
by Sridhar Babu |

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు రూ .216 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story