YS Sharmila:నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
YS Sharmila:నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల.. కారణం ఏంటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీపీసీసీ(APPCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(బుధవారం) వైఎస్ షర్మిల సాయంత్రం 4.30కు రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌(AP Governor Abdul Nazir)ను కలవనున్నారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్ర రాజకీయాలపై గవర్నర్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్(YS Jagan) అదానీ నుంచి భారీ స్థాయిలో లంచం అందుకున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి ఇటు కూటమి ప్రభుత్వం(AP Government) ఇటు షర్మిల కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అమెరికా న్యూయార్క్‌లో నమోదైన ఆదానీ లంచం కేసు విషయంలో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావనపై ఆమె సంచలన డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడుకి బహిరంగ లేఖ రాయడమే కాకుండా ఈ విషయంలో సీబీఐ(CBI) ఎంక్వైరీ కూడా చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. మంగళవారం ఇదే అంశాన్ని తెలుపుతూ విజయవాడ(Vijayawada)లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) వరకు వైఎస్ షర్మిల పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఇదే అంశంపై ఆమె గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియా(Social Media)లో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ను వైఎస్ షర్మిల కోరనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed