- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి..
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికంగా గెలిపించి, సత్తా చాటాలని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు అన్నారు. ఆదివారం వీకే ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు మోర పాక సత్యం అధ్యక్షతన జరిగిన జాజిరెడ్డిగూడెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు.
గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పార్టీ కార్యకర్తలు పాల్గొని, అధికారులకు సహకరించాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సతీష్ రెడ్డి, కొమిరెల్లి, యాదయ్య, పద్మ, రణధీర్, లక్ష్మణ్, నసీర్, గిరిబాబు, సాయికుమార్, మధు, సంతోష్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.