తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2025-01-05 16:44:49.0  )
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రపంచ తెలుగు సమాఖ్య(World Telugu Federation) 12వ వార్షికోత్సవ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యానికి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దేశవ్యాప్తంగా తెలుగు బాష మాట్లాడేవారు రెండో స్థానంలో ఉన్నారని.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు(Telugu people) సెటిల్ అయ్యారని.. వారందరిని ఒకే వేదికపై చూడటం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అభివృద్దిలో పోటీ నెలకొన్న విషయంపై ఆయన స్పందిస్తూ.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ(Competition between Telangana and Andhra Pradesh) లేదని.. రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితేనే అభివృద్ధిలో దూసుకుపోవచ్చు అని అన్నారు. మనకు మనం పోటీ కాదు.. ప్రపంచానికి పోటీ పడే స్థాయికి ఎదిగామని, తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేశాల మధ్య తలెత్తిన యుద్దాలే.. చర్చల కారణంగా ఆగిపోతున్నాయని, రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా చర్చల ద్వారానే సమసిపోతాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed