- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
High court: అమ్మాయిని ఒక్కసారి మాత్రమే ఫాలో అయితే వేధించినట్టు కాదు.. బాంబే హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: అమ్మాయిని ఒక్కసారి మాత్రమే ఫాలో అయితే వేధించినట్టు కాదని బాంబే హైకోర్టు (Bombay high court) స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 354-D ప్రకారం ఇది వెంబడించడం కిందకు రాదని, కాబట్టి ఈ చర్యను నేరంగా పరిగణించడానికి వీలు లేదని తెలిపింది. ఒక వ్యక్తి నిరంతరం వేధిస్తేనే నేరంగా పరిగణించొచ్చని పేర్కొంది. ఐపీసీ, పోక్సో చట్టం కింద నేరాలకు సంబంధించి తమ శిక్షలను సవాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వేర్వేరు అప్పీళ్లను బెంచ్ తాజాగా విచారించింది. వారి పిటిషన్లను స్వీకరించిన కోర్టు కొన్ని అభియోగాల నుంచి నిర్దోషులుగా ప్రకటించింది. కానీ నిందితులపై నమోదైన ఇతర నేరాలకు సంబంధించిన శిక్షను మాత్రం సమర్ధించింది.
కాగా, మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తనను కొన్ని నెలలుగా నిందితులు వేధిస్తున్నారని ఆరోపించింది. తన ఇంట్లోకి సైతం ప్రవేశించి బెదిరించారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు వారికి ఏడేళ్ల శిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరిలో ఒక వ్యక్తిని అన్ని కేసుల్లో హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించగా, మరొకరికి కొన్ని కేసుల్లో మాత్రమే ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్ష సరైందేనని తెలిపింది.