హుజూర్ నగర్ కు నూతన ప్రభుత్వ ఐటిఐ మంజూరు

by Y. Venkata Narasimha Reddy |
హుజూర్ నగర్ కు నూతన ప్రభుత్వ ఐటిఐ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ :హుజూర్ నగర్ నియోజకవర్గానికి నూతన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటిఐ) కళాశాల మంజూరు చేయడం జరిగిందని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నా అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నూతన ఐటిఐకి 14.35 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి జి.ఓ.ఎం.ఎస్. నెంబర్.13, తేదీ.28.09.2024 ద్వారా మంజూరు చేయడం జరిగిందని ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రభుత్వ నూతన ఐటిఐ కూడా ఇదివరకు మంజూరు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కి ప్రక్కన హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గుట్ట దగ్గర ఏర్పాటు చేయబడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంతో పాటు జిల్లా విద్యార్థులు నూతన ప్రభుత్వ ఐటిఐ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్, డీజిల్ మెకానిక్ లతో పాటు వెల్డర్ కోర్సులలో శిక్షణ నిమిత్తం ప్రారంభిస్తున్న ఈ నూతన ఐటిఐతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మొత్తం ఐదు కోర్సులలో 216మంది విద్యార్థులతో ప్రారంభం కానున్న నూతన ఐటిఐకి ప్రిన్సిపాల్ తో సహా 8 పోస్టులను మంజూరు చేయించామని తెలిపారు.

Next Story