టెక్నికల్‌గా మాయ చేశారు..సీఎంఆర్ ప్యాడి గోల్‌మాల్‌లో ఆయనదే కీలక పాత్ర

by Aamani |
టెక్నికల్‌గా మాయ చేశారు..సీఎంఆర్ ప్యాడి  గోల్‌మాల్‌లో ఆయనదే కీలక పాత్ర
X

దిశ, ఖమ్మం సిటీ : గత ప్రభుత్వ హయాంలో వరికి మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం వారు పండించిన వడ్లను నేరుగా ప్రభుత్వమే సీఎంఆర్ స్కీం కింద కొనుగోలు చేసేది. దీనిని అదునుగా చేసుకున్న పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నరసింహారావు తన టెక్నికల్ తెలివితేటలను ఉపయోగించి ఆ శాఖపై పట్టు సాధించినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 66 మిల్లులు ఉండగా వాటిలో సగానికి పైగా మిల్లులో ఈ సీఎంఆర్ ప్యాడిని ప్రభుత్వం ఈ అధికారుల ద్వారా అప్పజెప్పింది. దీనిని అదనకు చేసుకున్న టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కొంతమంది మిల్లర్లతో ములాకత్ అయ్యి వారికి ఎలాంటి అర్హత లేకపోయినా ఆ మిల్లులకు ఇబ్బడి ముబ్బడిగా సీఎంఆర్ ప్యాడిని కేటాయించే వారనే విమర్శలు ఎదురవుతున్నాయి.

దీనివల్ల కొంతమంది బడా మిల్లర్లు టెక్నికల్ మేనేజర్కు అందిన కాడికి ముడుపులు అప్ప చెబుతూ సొంత ఇంట్లో వారి వలె ప్రతి వారంలో రెండు మూడు రోజులు విందులు, వినోదాలకు డబ్బులు ఖర్చు పెడుతూ ప్రభుత్వ ఆదాయం కి గండి కొట్టేవారని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే సీఎంఆర్ ప్యాడి కేటాయింపు తో పాటు గన్ని సంచుల వ్యవహారంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించే వారనే వాదనలు లేకపోలేదు. రైతు కు ఒక్కో సంచికి రూ.17 నుంచి 25 చేసి వారు మాత్రం ప్రభుత్వం నుంచి రూ.30 బిల్లులు పెట్టేలా చూడడం లో ఆయనదే కీలక పాత్ర పోషించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అక్రమంగా సంపాదించిన సంపాదనతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడగట్టుకొని బీనామీ పేర్లపై కూడా వాటిని భద్రపరచుకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

ఏళ్లకు తరబడి శాఖలో తిష్ట వేసుకున్న ఈతగాడు ఆ శాఖ ఉన్నత అధికారులను సైతం తను చెప్పిందే చేయాలంటూ హుకుం జారీ చేసే వారని లేకుంటే తనకున్న రాజకీయ నాయకుల అండదండలతో వారిని తను అనుకున్న స్థానాలకు బదిలీ చేయిస్తానని హెచ్చరికలు జారీ చేసే వారిని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లాలోనే ఇతగాడి వల్ల సీఎంఆర్ ప్యాడి లో సుమారు రూ. 200 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. స్థానిక సంబంధాలు, శాఖపై అపార అనుభవం ఇతనికి కలిసి వచ్చిన అంశాలు. దీనివల్లే గత ఏడాదిన్నరగా కొన్ని పెద్ద మిల్లులు ఏర్పడ్డాయి అనేది తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ సీఎంఆర్ ప్యాడి పక్కదారి పట్టడానికి ఇంటి దొంగలు ఎక్కువ అవ్వడం వల్ల ఈ పథకం నీరుగారే పరిస్థితి దాపురించిందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story