ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మోహన్ రాజ్ కన్నుమూత

by Gantepaka Srikanth |
ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమ(Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సౌత్ ఇండస్ట్రీ(South Industry)లో ప్రతినాయకుడి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ రాజ్(72) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆయన కేరళలోని తిరువనంతపురం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా, తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మోహన్ రాజ్(Mohan Raj) సినిమాల్లోనూ నటించారు. అన్ని భాషల్లో కలిసి మొత్తం 300ల పైచిలుకు చిత్రాల్లో నటించారు. రెండేళ్ల కిందట మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన 'రోర్షాచ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ రాజ్ చివరిసారిగా నటించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.

Advertisement

Next Story