Dalits : దళితులకు పూర్తి స్వాతంత్య్రం ఇంకా రాలేదు : తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి

by Hajipasha |
Dalits : దళితులకు పూర్తి స్వాతంత్య్రం ఇంకా రాలేదు : తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడులో దళితులపై నేరాలు గత మూడేళ్లలో 40 శాతం మేర పెరిగాయని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. సాక్షాత్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అధికారిక నివేదికలే ఈవిషయాన్ని తెలియజేస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్ష పడే రేటు జాతీయ సగటులో సగం మాత్రమే ఉందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘తమిళనాడులో దళితులు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. కొన్ని వీధులు, ఆలయాల్లోకి వారిని రానివ్వడం లేదు. పలుచోట్ల దళిత కాలనీల వాటర్ ట్యాంకుల్లో మానవ వ్యర్థాలను కలిపిన దురాగతాలు కూడా జరిగాయి’’ అని ఆయన తెలిపారు. ‘‘బ్రిటీష్ వాళ్లు మన దేశం విడిచి వెళ్లిపోయినా ఇంకా దళితులకు పూర్తి స్వాతంత్య్రం రాలేదు. వారిపై సామాజిక వివక్ష చూపడం సరికాదు’’ అని తమిళనాడు గవర్నర్ చెప్పారు. ‘‘లిక్కర్ మాఫియా స్వార్థానికి బలి అవుతున్న వారిలో అత్యధికులు దళితులే. తమిళనాడులోని కల్లకురిచిలో జరిగిన కల్తీ సారా విషాదమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం’’ అని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed