- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జూనియర్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్..15కు చేరిన పతకాల సంఖ్య
దిశ, స్పోర్ట్స్ : పెరూలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. గురువారం ఖుషి కాంస్య పతకం అందించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కేటగిరీలో పతకం గెలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఖుషి 585 స్కోరుతో 7వ స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించింది. అనుష్క(585) 11వ స్థానంలో, సాక్షి పడేకర్(581) 24వ స్థానంలో, మెల్వినా(580) 32వ స్థానంలో, ప్రాచి గైక్వాడ్(575) 41వ స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అవ్వడంలో విఫలమయ్యారు. టాప్-8 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్‌లోనూ ఖుషి సత్తాచాటింది. 447.3 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. టోర్నీలో మొదటి రోజు నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ 15 మెడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అందులో 10 స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.