రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by Naveena |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, కొల్లాపూర్ (పెద్ద కొత్తపల్లి): దంపతులు బైక్ పై స్వంత గ్రామానికి వస్తూ మార్గమధ్యంలో అదుపు తప్పి బుధవారం రాత్రి భార్య కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా హాస్పిటల్ కు తరలించగా..చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన పెద్ద కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది. దేవుని తిర్మాలాపూర్ గ్రామానికి చెందిన బొల్లె నాగేష్, లక్ష్మి దంపతులు బైక్ పై వయా నక్కలపల్లి మీదుగా వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ వెన్నచర్ల, నక్కలపల్లి మధ్య అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో భార్య లక్ష్మి తీవ్ర గాయాలు కావడంతో..నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించగా ఆమె మరణించారు.

Next Story