ఇదొక లవ్ & ఎమోషన్‌ల్‌ రైడ్‌.. ‘రోటి కపడా రొమాన్స్’పై డైరెక్టర్ కామెంట్స్

by sudharani |
ఇదొక లవ్ & ఎమోషన్‌ల్‌ రైడ్‌.. ‘రోటి కపడా రొమాన్స్’పై డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'నేటి యువతరానికి నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ప్రతి పాత్ర యూత్‌తో పాటు అందరికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రయిలర్‌కు మంచి స్పందన వచ్చింది' అన్నారు.

డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా విజయం గురించి ఎలాంటి డౌట్‌ లేదు. తప్పకుండా హిట్‌ కొడుతున్నాం. అయితే ఏది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో ఉంది. ఇదొక ఎమోషన్‌ల్‌ రైడ్‌. లవ్‌, ఎమోషన్‌ ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో ఉంటాయి' అన్నారు.

Read More...

డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న కమల్ హాసన్ ‘ఇండియన్-3’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

Next Story