మహిళా క్రికెటర్ల భద్రతకు ఐసీసీ AI టూల్

by saikumar |
మహిళా క్రికెటర్ల భద్రతకు ఐసీసీ AI టూల్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సంద్భరంగా మహిళా క్రికెటర్ల భద్రత కోసం ఐసీసీ ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. సోషల్ మీడియా మోడరేషన్ ప్రొగ్రామ్‌ను గురువారం లాంచ్ చేసింది. ఈ టూల్ సోషల్ మీడియాలో అభ్యంతరమైన, ద్వేషపూరితమైన కంటెంట్ నుంచి మహిళా క్రికెటర్లను రక్షించేందుకు ఉపయోగపడుతుందని ఐసీసీ పేర్కొంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే ప్లేయర్లకు సానుకూల వాతావరణాన్ని అందించేందుకు ఈ టూల్ ప్రయత్నిస్తుంది’ అని ఐసీసీ డిజిటల్ హెడ్ ఫిన్ బ్రాడ్ షా తెలిపారు.

కాగా, ఈ టూల్ ఐసీసీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూటూబ్ చానెల్స్ ఖాతాలతోపాటు ఈ ప్రొగ్రామ్‌లో సైన్ అఫ్ అయిన మహిళా క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్లను మానిటర్ చేస్తుంది. అభ్యంతరకర, ద్వేషపూరిత కంటెంట్, వేధింపులకు సంబంధించిన కామెంట్లు ఉంటే వాటిని ఇన్ యాక్టివ్ చేస్తుంది. ఇప్పటికే 60 మంది మహిళా క్రికెటర్లు ఈ ప్రొగ్రామ్‌లో సైన్ అప్ అయ్యారు. ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ఏఐ టూల్‌‌ను దక్షిణాఫ్రికా క్రికెటర్ సినాలో జఫ్తా సమర్థించింది. ‘వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఓడినా లేదా గెలిచిన అనంతరం ఫోన్ చూడటం కంటే మరో అధ్వానం ఉండదు. కించపరిచే కామెంట్లు పెడతారు. ఈ టూల్ ద్వారా విమర్శలతో సంబంధం లేకుండా ప్లేయర్లు తమ లైఫ్‌కు

Advertisement

Next Story