గౌరవం ఇవ్వండి.. తీసుకోండి: సెక్యులరిజంపై పవన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-03 15:24:16.0  )
గౌరవం ఇవ్వండి.. తీసుకోండి: సెక్యులరిజంపై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సెక్యులరిజం వన్‌వే కాదని, టూవే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan)అన్నారు. తిరుపతి(Tirupati)లో నిర్వహించిన వారాహి సభ(Varahi Sabha)లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మా(Sanatana Dharma)న్ని గౌరవించండని, తీసుకోండని పవన్‌ విజ్ఞప్తి చేశారు. తన జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని అనుకోలేదని చెప్పారు. కానీ వైసీపీ నేతలే ఆ పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) హయాంలో భక్తులకు కల్తీ ప్రసాదాలు పెట్టారని, వెంకన్నకు అపచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో సనాతన ధర్మానికి అపచారం చేస్తూనే వచ్చారని, అయినా భరించామని మండిపడ్డారు. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగిందని, తాను ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని తాను పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోందని విమర్శించారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed