ఈసారి వైసీపీని ఒకే సీటుకు పరిమితం చేస్తా.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
ఈసారి వైసీపీని ఒకే సీటుకు పరిమితం చేస్తా.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ(YCP) పార్టీకి 11 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేస్తే.. కేవలం పదకొండు సీట్లే వచ్చాయని టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధిరాలేదని మండిపడ్డారు. ‘ఈసారి ఎన్నికలు పెట్టమనండి.. ఒకే సీటుకు పరిమితం చేస్తా’ అని కీలక ప్రకటన చేశారు. ‘సనాతన ధర్మం పాటించేవారి పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పనిచేస్తాయి. సనాతన ధర్మాన్ని దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది’ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకి వచ్చి పోరాటం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ప్రకటించారు. అంతేకాదు.. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణ త్యాగం కూడా చేస్తానంటూ కామెంట్స్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అన్నారు.

Next Story