సర్వే గుబులు.. అప్రమత్తమైన అధిష్టానం

by samatah |
సర్వే గుబులు.. అప్రమత్తమైన అధిష్టానం
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుపు అవకాశాలపై అధికార పార్టీ చేయించిన సర్వే నివేదిక అధికార పార్టీ కంగుతినే విధంగా వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో బీఆర్​ఎస్​ పార్టీ సర్వేతో అప్రమత్తమైన బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో ఇటీవల భేటి అయ్యారు. టికెట్లు వస్తుందో రాదో అని అందోళన చెందిన సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్​ భేటి కావడం హాట్​ టాపిక్​గా మారగా చర్చ మొత్తం బీఆర్​ఎస్​ పార్టీ చేయించిన సర్వే మీదనే జరిగినట్లు తెలిసింది.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా సిట్టింగ్​ ఎమ్మెల్యేతో బీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ భేటి అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేలతో కేటీఆర్​ భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్​ రావు, ఎల్​. రమణ సైతం భేటిలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో కేటీఆర్​ భేటి కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటిలో బీఆర్​ఎస్​ పార్టీ ఇటీవల నియోజకవర్గాల వారీగా చేపట్టిన సర్వే నివేదిక​పై చర్చ జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ, ఐదు స్థానాల్లో మాత్రమే బీఆర్​ఎస్​ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టు వచ్చినట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని ఒక మంథని నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్​ పార్టీ విజయం సాధించగా 11 స్థానాల్లో బీఆర్​ఎస్​ విజయం సాధించింది. ప్రస్తుత సర్వే నివేదికల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సత్తా చాటాలంటే కనీసం ఇప్పటి నుంచి అయిన కష్టపడి పని చేయాలని కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్​ తీసుకున్నట్లు సమాచారం.

ఊగిసలాటలో ఆశావహులు..

మంత్రి కేటీఆర్ సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో భేటి కావడంతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల టికెట్​ ఆశిస్తున్న ఆశావహులు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. మొన్నటి వరకు సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో తమకు టికెట్​ వస్తుందని భావించిన ఆశావహులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కేటీఆర్​ సిట్టింగులతో సమావేశం ఏర్పాటు చేయడంతో ఆశావహుల విషయం చర్చకు వచ్చిందా?.. వస్తే ఏమీ చర్చ జరిగింది?.. అనేది బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారిలో టెన్షన్​ మొదలైయింది. సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో భేటి ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో హాట్​ టాఫిక్​గా మారింది.

Advertisement

Next Story