కూర ఉడుకుతంది బిడ్డా.. కొంచెం బువ్వ తినిపో..

by Sumithra |
కూర ఉడుకుతంది బిడ్డా.. కొంచెం బువ్వ తినిపో..
X

దిశ, మానకొండూర్ : రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కు ప్రజాధరణ రోజురోజుకు ఎంతగానో పెరిగిపోతుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ సంఘటన. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్డి గ్రామంలో గురువారం తొలిపొద్దు పర్యటనలో భాగంగా పర్యటిస్తూ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా తానే వెళ్లి కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణి చేశారు. ఓ ఇంటికి చెక్కు అందజేయడానికి వెళ్లగా న్యాత తార అనే ఓ అవ్వ తన ఇంటి ముందు కట్టెల పొయ్యి పై వంట చేస్తుంది. ద్విచక్ర వాహనం పై వెళ్లిన ఎమ్మెల్యే రసమయిని చూసిన అవ్వ ఆయనకు ఎదురుగా వెళ్లి బిడ్డా రసమయి మంచిగున్నావా అంటూ ఎదురొచ్చి ఆప్యాయ్యంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికింది.

ఆమె ఇంటి ముందు నేలపైనే కూర్చొని అవ్వతో కాసేపు ముచ్చటించారు. అవ్వ మాట్లాడుతూ మాలాంటి పేదోళ్లకు ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ పైసలు ఇచ్చి కేసిఆర్ సారూ పెద్ద కొడుకు, నువ్వు చిన్న కొడుకులయ్యిండ్రు, పొయ్యి మీదా టమాటా కూర ఉడుకుతాంది కొంచెం బువ్వ తినిపో బిడ్డా అంటూ అవ్వ అన్న మాటలకు రసమయి చలించిపోయారు. అవ్వా నీ ప్రేమ నామీద ఎప్పుడు ఇట్లనే ఉండాలే, మీలాంటి ఎంతో మంది అవ్వలను సీఎం కేసీఆర్ సారు గుండెలో పెట్టుకొని సాదుకుంటుండు, ఇగో సారూ నీ మనుమరాలు శ్వేత పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కు పంపిండు అంటూ చెక్కుతో పాటు చీరను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed