ఆసుపత్రి మరమ్మతు పనులు పట్ల కలెక్టర్ సంతృప్తి..

by Aamani |
ఆసుపత్రి మరమ్మతు పనులు పట్ల కలెక్టర్ సంతృప్తి..
X

దిశ,మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతి పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆసుపత్రిలోని చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని పరిశీలించారు.ఆసుపత్రి మరమ్మత్తు పనుల కోసం కలెక్టరేట్ నిధుల నుంచి ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు.ఆ నిధులను వినియోగిస్తూ జిల్లా ఆసుపత్రిలో 3 వార్డులలో మరమ్మతు పనులు చేపట్టగా 2 వార్డులలో పనులు పూర్తి అయ్యాయని,3వ వార్డులో పెయింటింగ్ పని జరుగుతుందని, 5 రోజుల్లో ఆ పనులు సైతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.

అనంతరం రామగిరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించిన కలెక్టర్, ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతిరోజు ఎంతమంది లేబర్ వస్తున్నారు, గ్రామాలలోని నర్సరీలలో బ్యాక్ ఫీలింగ్ ఎంతవరకు పూర్తయింది, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతి సంబంధిత అంశాలను ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మెడికల్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గణపతి, రామగిరి ఎంపీడీవో శైలజా రాణి, సుపరెండెంట్ ఉమేష్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed