Peddapalli : సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం.

by Aamani |
Peddapalli : సెల్ఫీ వీడియో  తీసుకుంటూ  ఆత్మహత్యాయత్నం.
X

దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే బెల్ట్ షాప్ దుకాణదారుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. పెరకపల్లి గ్రామానికి చెందిన సంతోష్, మియాపూర్ లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. సుల్తానాబాద్ మండలంలో సిండికేట్ గా ఏర్పడిన మద్యం దుకాణదారులు బెల్ట్ షాప్ లకి అధిక ధరలకు మద్యం విక్రయించడం వల్ల తన బెల్ట్ షాపులో మద్యాన్ని అధిక రేటుకు అమ్మ వలసి వస్తుందని సంతోష్ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అది గమనించిన సిండికేట్ నిర్వహకులు స్టేటస్ లో ఆ విధంగా ఎందుకు పెట్టావ్ అంటూ, మానసికంగా వేధించారని సోమవారం రోజు రాత్రి థమ్స్ అప్ లోఎలుకల మందు కలుపుకొని తాగుతున్నానని తన ఆత్మహత్యాయత్నానికి వాళ్లే కారణమంటూ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.సిండికేట్ వ్యాపారస్తులకు అధికారులు అండదండలు ఉన్నాయని ఆ వీడియోలులో తెలిపారు.ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వీడియో వాట్సాప్ గ్రూప్ లలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed