అన్నంలో పురుగులు..చారు నీళ్లు..సంచలనం రేపిన విద్యార్థుల నిర్ణయం

by Aamani |
అన్నంలో పురుగులు..చారు నీళ్లు..సంచలనం రేపిన  విద్యార్థుల నిర్ణయం
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి మండలంలోని ఆరవెల్లి పాఠశాలను మధ్యాహ్న సమయంలోనే విద్యార్థులు విడిచి వెళ్లడం మండలం లో సంచలనం రేపింది. పురుగుల అన్నం నీళ్ళ చారుతో పెట్టే మధ్యాహ్న భోజనం మా కొద్దంటూ సోమవారం ఆరవెల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేసి పాఠశాలను విడిచి వెళ్లారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం అరవెల్లి జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు విద్యార్థులకు పురుగులు పడిన అన్నం, వెంట్రుకలు తో కూడిన కూరలు, నీళ్ల చారును అందిస్తు ఇబ్బంది పెడుతున్నారని, మధ్యాహ్న సమయంలో నిరసన వ్యక్తం చేసిన పిల్లలు పాఠశాలను విడిచి వెళ్లారు. గత కొన్ని నెలలుగా సరైన భోజనం పెట్టకుండా వంట ఏజెన్సీ నిర్వాహకులు తమను ఇబ్బంది పెడుతున్నారని, భోజనం మంచిగా పెట్టాలని అడిగితే, తమను తిడుతున్నారని పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారు.

వంట మనుషులు యశోద పద్మ, బండ్ర పద్మ నాసిరకమైన భోజనం పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వెల్లడించారు. వంట ఏజెన్సీ నుంచి వారిని తొలగించే వరకు తాము పాఠశాలకు రామని ఆందోళనకు దిగారు. అనంతరం వారి తల్లి దండ్రులను పాఠశాలకు పిలుచుకొని వారితో కలిసి మధ్యాహ్న సమయంలోనే పాఠశాలను విడిచి ఇంటికి వెళ్లడం విశేషం. కలుషితం అయిన ఆహారం తింటే పిల్లల ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పెద్దాపూర్ సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటన మరోసారి జిల్లాలో పునరావృతం కాకముందే తక్షణమే సంబంధిత అధికారులు ఆరవెల్లి పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన నిర్వహణ పై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed