Jio: జియోలో ఈ ప్లాన్ ధర చాలా తక్కువ.. 84 రోజుల వ్యాలిడిటీ!

by Prasanna |
Jio: జియోలో ఈ ప్లాన్ ధర చాలా తక్కువ.. 84 రోజుల వ్యాలిడిటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్ర స్థానంలో నిలిచిన జియో ఈ మధ్య కాలంలో పడిపోయింది మళ్ళీ తన స్థానం కోసం ఇతర సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల కోసం రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. ఇక మూడు నెలలు అంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇది ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌ లను పొందుతారు. జియో ప్లాన్ ధర రూ. 479. ఇది మై జియో యాప్ లో అందుబాటులో ఉంది.

అన్ లిమిటెడ్ కాల్స్

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో జియో కస్టమర్లు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. దీనిలో మీరు లోకల్, ఎస్టీడీ కాల్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.

డేటా ఎంతంటే

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో జియో కస్టమర్లు 6GB డేటాను యాక్సెస్ చేస్తారు. ఈ డేటా చాలా మందికి చాలా తక్కువగా అనిపించవచ్చు.

ఎస్‌ఎంఎస్‌

కాలింగ్‌ కోసం చూస్తున్న వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెటర్. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 1000 ఎస్‌ఎంఎస్‌ లకు యాక్సెస్ పొందుతారు.

Advertisement

Next Story

Most Viewed