- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi turns 74: ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, పని బలంతో అసాధారణ నాయకత్వం ..అందించి దేశ శ్రేయస్సు, ప్రతిష్టను పెంచారు. జాతి స్ఫూర్తితో మీరు చేస్తున్న వినూత్న ప్రయత్నాలతో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మీ మార్గం సుగమం కావాలని కోరుకుంటున్నా. ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు.
మోడీకి శుభాకాంక్షల వెల్లువ
అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టి దేశప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకొచ్చారని అమిత్ షా మోడీని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలో దేశానికి సేవ చేయడం తన అదృష్టమని మోడీకి అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మోడీ దూరదృష్టి, బలమైన నాయకత్వాన్ని చూసిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పూర్తి సంసిద్ధతతో, అంకితభావంతో దేశాన్ని ముందుకు నడిపించారంటూ మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. మోడీకి కేంద్రమంత్రి జేపీ నడ్డా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంత్యోదయ అనే మంత్రంతో ప్రతీ క్షణాన్ని దేశానికి, దేశ ప్రజలకు అంకితం చేసి విజయవంతమైన ప్రధానిగా నిలిచారని కొనియాడారు. లక్షల మంది బీజేపీ కార్యకర్తలకు ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకం అని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నేత, వన్ ఇండియా- బెస్ట్ ఇండియా దార్శనికుడైన ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాసుకొచ్చారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్య సాధనకు మీ జీవితంలోని ప్రతీ క్షణం అంకితం చేయడం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.