Breaking: అమరవీరులకు సీఎం రేవంత్ ఘన నివాళులు

by srinivas |
Breaking: అమరవీరులకు సీఎం రేవంత్ ఘన నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day)సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాయుథ పోరాటంలో ప్రజల ప్రాణత్యాగాలను ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అశువుల బాసిన అమరవీరుల ఆశయాలు, నిబద్ధతలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు నిర్వహించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed