Game Changer: గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. ఇక నుంచి ప్రతి వారం మోత మోగిపోవడం పక్కా!

by Prasanna |   ( Updated:2024-09-19 14:44:58.0  )
Game Changer: గేమ్ ఛేంజర్ పై వరుస అప్డేట్స్ ఇచ్చిన తమన్.. ఇక నుంచి ప్రతి వారం మోత మోగిపోవడం పక్కా!
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై అంచనాలు ఉన్నా .. ఇంత వరకు ఎలాంటి అప్డేట్స్ లేవని మెగా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సినిమా స్టార్ట్ అయి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి ఒక్క పాట , రెండు పోస్టర్స్ తప్ప ఏవి కూడా బయటకు రాలేదు. క్రిస్మస్ కి పండుగకు విడుదల చేస్తామని చెప్పిన దిల్ రాజు ఇంత వరకు డేట్ గురించి క్లారిటీ చెప్పలేదు. ఇంకా సినిమా విడుదలకు మూడు నెలలే ఉంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరుసగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇచ్చారు. ఇంతక ముందు వేరే సినిమాల గురించి అప్డేట్స్ లీక్ చేసిన తమన్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ లీక్ చేసాడు.

ట్విట్టర్లో తమన్.. గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ మూవీ సినిమా డిసెంబర్ 20న ఆడియెన్స్ ముందుకు రానుంది. అంటే ఇక నుంచి రచ్చ రచ్చే .. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్, వరుస అప్డేట్స్ ఉంటాయి. మీరు కూడా రెడీ గా ఉండండి. వచ్చే వారమే గేమ్ ఛేంజర్ నుంచి తర్వాత అప్డేట్ రానుంది. మీకు నచ్చుతుంది .. అదిరిపోతుంది కూడా అంటూ అని ట్వీట్స్ చేసాడు. హమ్మయ్య మీరు అయినా అప్డేట్స్ ఇచ్చారంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

Movie: రెండో సారి అలరించడానికి రెడీ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్లు


Click Here For Twitter Post..

Advertisement

Next Story