- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తప్పిపోయిన గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం
దిశ, చింతపల్లి (దేవరకొండ): దేవరకొండ మైనార్టీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మంగళవారం మిస్ అవ్వగా వారి ఆచూకీ బుధవారం అర్థరాత్రి లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం గురుకుల మైనార్టీ పాఠశాల నుంచి విద్యార్థులు తౌఫిక్, అబ్దుల్ రహమాన్, ముజీబ్ మిస్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, స్పెషల్ టీంలను రంగంలోకి దింపి విద్యార్థుల ఆచూకీని కనిపెట్టారు. బుధవారం అర్ధరాత్రి 12.30 నిమిషాలకు మాల్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. అనంతరం వారిని దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థుల ఆచూకీ కోసం శ్రమించిన దేవరకొండ సీఐ నరసింహులు, కొండమల్లేపల్లి సీఐ ధనంజయ, దేవరకొండ ఎస్సై అజ్మీరా రమేష్, నల్గొండ జిల్లా స్పెషల్ టీం బృందానికి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్క్షతలు తెలిపారు.