- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జానీ మాస్టర్ పై కరాటే కళ్యాణి ఫైర్.. అలాంటి వాడిని అస్సలు వదలొద్దు అంటూ సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master)పై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలువురు స్పందించగా.. తాజాగా సీనియర్ యాక్టర్ కరాటే కళ్యాణి(Karate Kalyani) స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఈ రోజు ఎక్కడ చూసిన జానీ మాస్టర్ హిందూ అమ్మాయి పైన అత్యాచారం చేశారు.. చేయబోయారు.. చాలా చాలా హింసించారు.. అలాగే చిత్ర హింసలకు గురిచేస్తూ మతం మారి పెళ్లి చేసుకోవాలి అనే కోణంలో ఆయన గురించి చాలా చాలా విషయాలు విన్నాము. అసలు హిందూ అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడటం దుశ్చర్య. ఇది లవ్ జిహాదే(Love Jihad). పక్క రాష్ట్రంలో ఓ పార్టీ నేతగా ఉన్న జానీ మాస్టర్.. గతంలో క్రిస్టియన్స్ ఆంధ్రాలో మతమార్పిడులు చేస్తున్నారని చాలా గట్టిగా ప్రచారం చేశారు. అలా అప్పుడు మత మార్పిడులను వ్యతిరేకించిన జానీ మాస్టర్.. ఈ రోజు ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణం. జానీ మాస్టర్ ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన లేదా ఒక పార్టీ నేత అయినంత మాత్రాన ఆయనకు మనం మద్దతుగా ఉండాల్సిన పని లేదు.
అలాగే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని పెట్టిన ఇబ్బందులు.. ఆ అమ్మాయి చెబుతున్న తీరును సమాజం అర్థం చేసుకొని అందరూ బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకు అండగా ఉండాలి. నేను కూడా ఆ బాధితురాలికి మద్దతు ప్రకటిస్తున్నాను. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అందరూ ఫైట్ చేయాలి. మత మార్పిడిలను ఏమాత్రం ప్రోత్సహించకుండా ఇలాంటి వాటి పట్ల రేవంత్ సర్కార్(RevanthReddy) కఠినంగా చర్యలు తీసుకోవాలి. తప్పు చేసినట్లు తేలితే వెంటనే జానీ మాస్టర్‌ను అరెస్టు(Arrest) చేసి చర్యలు తీసుకోవాలి. అయితే ఈ కేసు విషయంలో మరేదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా ఎంక్వయిరీ చేసి విచారణ చేపట్టాలి” అని కరాటే కళ్యాణి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
More News : నెట్టింట దుమారం రేపుతున్న నాగబాబు ట్వీట్.